కొట్టుడు లేదు.. తరుముడు లేదు

కొట్టుడు లేదు.. తరుముడు లేదు
  • రూల్స్ బ్రేక్ చేస్తే కేసులు, వెహికల్స్ సీజ్ 
  • బండ్లు నడుపుతున్న 25 వేల మందిపై కేసులు
  • గ్రేటర్​ హైదరాబాద్​లో 11 వేలు నమోదు  
  • 63,786 మాస్క్ వయొలేషన్ కేసులు
  • గ్రేటర్​లో 350 చెక్​పోస్టులు ఏర్పాటు​

హైదరాబాద్, వెలుగు: గతేడాది లాక్​డౌన్ టైమ్​లో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై లాఠీలకు పని చెప్పిన పోలీసులు ఈసారి రూట్ మార్చారు. లాఠీలను పక్కనబెట్టి స్మార్ట్ పోలీసింగ్ చేస్తున్నారు. రూల్స్ బ్రేక్​చేస్తే అక్కడికక్కడే కేసులు పెట్టి వెహికల్స్ సీజ్ చేస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో వెహికల్స్​ను గుర్తించి కేసులు ఫైల్ చేస్తున్నారు. 

3 రోజుల్లో 25 వేల లాక్​డౌన్ కేసులు
రాష్ట్రంలో బుధవారం లాక్​డౌన్ స్టార్టయినప్పటి నుంచి శుక్రవారం వరకు 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ లాక్​డౌన్ రూల్స్​ఉల్లంఘించిన వాహనదారులపై పెట్టినవే. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3,894, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,970, హైదరాబాద్ పరిధిలో 5,767 కేసులు నమోదయ్యాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం11,633 కేసులు నమోదు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 

వరంగల్ కమిషరేట్ పరిధిలో లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు వెయ్యి దాటాయి. హైదరాబాద్ బయట రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో 14 వేలకు కేసులు వాహనదారులపై రిజిస్టరయ్యాయి. గతేడాది మార్చి 23 నుంచి మే 13 వరకు అమలు చేసిన లాక్ డౌన్​లో హైదరాబాద్‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌, రాచకొండ కమిషనరేట్‌‌‌‌ సుమారు 3.25 లక్షల వాహనదారులపై కేసులు నమోదు చేశారు. 

ఇష్టారాజ్యంగా రోడ్లపైకి..

జిల్లాల్లో లాక్ డౌన్ కొంత మేర అమలవుతున్నా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న చిన్న అవసరాల కోసం, ఇళ్లలో ఉండలేక రోడ్లపైకి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. 3 కమిషనరేట్ల లిమిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలిపి 350 చెక్‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రధాన రహదారులపై బారికేడ్లు పెట్టినా ఇలాంటి వ్యక్తులను అడ్డుకోలేకపోతున్నారు. చెక్ పోస్టులకు చిక్కకుండా గల్లీల ద్వారా వెళ్లాల్సిన ప్లేస్ కు చేరుకుంటున్నారు. పోలీసులకు చిక్కితే ఏదో అనారోగ్య కారణంతో తప్పించుకుంటున్నారు. హైదరాబాద్‌‌‌‌ సిటీ జనం మాస్క్‌‌‌‌ లేకుండా రోడ్లపై తిరుగుతూ కరోనా క్యారియర్స్‌‌‌‌గా మారుతున్నారు. లాక్‌‌‌‌డౌన్ సడలింపుల టైమ్​లో వెజిటబుల్‌‌‌‌ మార్కెట్స్‌‌‌‌, జనరల్‌‌‌‌ స్టోర్స్‌‌‌‌, వైన్‌‌‌‌ షాప్స్‌‌‌‌ దగ్గర గుంపులుగా జమవుతున్నారు. కరోనా రూల్స్ పాటించట్లేదు. పాజిటివ్‌‌‌‌ కాంటాక్ట్స్‌‌‌‌ వ్యక్తులూ షాపింగ్‌‌‌‌ కోసం బయటకు వస్తున్నారు. దీంతో కరోనా తీవ్రత పెరిగే అవకాశముందని పలువురు అంటున్నారు. 

సడలింపుల టైమ్​లో పోలీసుల ఫోకస్​

లాక్‌‌‌‌డౌన్ సడలింపుల టైమ్​లో పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్‌‌‌‌లో మాస్క్‌‌‌‌, ఫిజికల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌పై పోలీసులు ఫోకస్‌‌‌‌ పెట్టారు. వీడియో రికార్డింగ్‌‌‌‌, సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌‌‌‌ ఆధారంగా రూల్స్‌‌‌‌ వయొలేషన్స్‌‌‌‌ ఎక్కువగా జరుగుతున్న ఏరియాలను గుర్తించారు. బ్లూ కోల్ట్‌‌‌‌ కానిస్టేబుల్స్‌‌‌‌ మాస్క్‌‌‌‌ వయొలేషన్ కేసులు రిజిస్టర్ చేయిస్తున్నారు. షాప్ యజమానులతో పాటు మాస్క్‌‌‌‌ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తిస్తున్నారు. ఫొటోలు తీసి పేరు, మొబైల్, ఆధార్‌‌‌‌‌‌‌‌ నంబర్​ను టీఎస్‌‌‌‌ కాప్‌‌‌‌ యాప్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తున్నారు.

3 రోజులు.. 5,869 మాస్క్ వయొలేషన్​కేసులు 

సెకండ్‌‌‌‌ వేవ్‌‌‌‌ లో హైదరాబాద్​సిటీ పోలీసులు 63,786 మందిపై మాస్క్‌‌‌‌ వయొలేషన్‌‌‌‌ కేసులు రిజిస్టర్ చేశారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ అమల్లోకి వచ్చిన బుధవారం నుంచి శుక్రవారం వరకు గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో 19,247 కేసులు రిజిస్టరవగా ఇందులో మాస్క్‌‌‌‌ వయొలేషన్స్‌‌‌‌ కింద 5,869 మందికి రూ.1,000 జరిమానా విధించారు. పబ్లిక్ గ్యాదరింగ్స్‌‌‌‌పై కేసులు రిజిస్టర్ చేశారు. పబ్లిక్ ప్లేసెస్‌‌‌‌లో పాన్‌‌‌‌, గుట్కా, లిక్కర్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్న వారిపై యాక్షన్ తీసుకున్నారు. హైదరాబాద్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ లిమిట్స్‌‌‌‌లో అత్యధికంగా 5,767 లాక్‌‌‌‌డౌన్ కేసులు రిజిస్టర్ చేశారు.