
వెలుగు, వీ6 టీ20 క్రికెట్ టోర్నమెంట్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పోటీల్లో కల్వకుర్తి జట్టు దూకుడుగా ఆడుతోంది. నాగర్ కర్నూల్ లో మంగళవారం జరిగిన మ్యాచ్ ల్లో కల్వకుర్తి రెండు విజయాలు నమోదు చేసింది. కల్వకుర్తి ఎమ్మెల్ యే జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. మొదటి మ్యాచ్ లో కల్వకుర్తి 34 పరుగుల తేడాతో అచ్చంపేటపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కల్వకుర్తి జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో అచ్చంపేట జట్టు 80 పరుగులకే ఆలౌట్ అయింది. కల్వకుర్తికి చెందిన శివశంకర్ మ్యాన్ ఆఫ్ ది మ్యా చ్ గా ఎంపికయ్యాడు. కొల్లాపూర్ తో జరిగిన మరో మ్యాచ్ లోనూ కల్వకుర్తి నెగ్గింది. మొదట కొల్లా పూర్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. అనంతరం కల్వకుర్తి జట్టు ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మరో మ్యాచ్ లో కొల్లా పూర్ 7 పరుగుల తేడాతో నాగర్ కర్నూల్ ను ఓడించింది. మొదట కొల్లాపూర్ రెండు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేయగా, ఛేజింగ్‌లో నాగర్ కర్నూల్ జట్టు 129 రన్స్‌కే ఆలౌటైంది.
సిద్దిపేట గెలుపు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో పోటీలను ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ప్రారంభించారు. ఉదయం జరిగిన మ్యాచ్ లో గజ్వేల్ పై సిద్దిపేట గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సిద్దిపేట జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 146 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన గజ్వేల్ 16.2 ఓవర్లలో 84 రన్స్‌కే ఆలౌట్ అయింది. సిద్దిపేట ఆల్ రౌండర్ సుశీల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపి కయ్యాడు. మధాహ్నం దుబ్బాకతో మ్యాచ్ లో గజ్వేల్ గెలిచింది. తొలుత గజ్వేల్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 161 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో దుబ్బాక 14.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. గజ్వేల్ ప్లేయర్ అమీర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపికయ్యాడు.
సూర్యా పేట, తుంగతుర్తి విజయాలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగు టోర్నీని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, డీఆర్ వో చంద్రయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ లు ప్రారంభించారు. ఉదయం జరిగిన మ్యాచ్ లో తుంగతుర్తిపై సూర్యాపేట గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సూర్యాపేట నిర్ణీత ఓవర్లలో 135 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో తుంగతుర్తి ఓవర్లన్నీ ఆడి మూడు వికెట్లకు 128 రన్స్ మాత్రమే చేసింది. సూర్యాపేట ఆటగాడు అన్వేష్ మ్యాన్ ఆఫ్ ది మ్యా చ్ గా ఎంపికయ్యాడు. మరో మ్యాచ్ లో కోదాడను తుంగతుర్తి ఓడించింది. మొదట కోదాడ జట్టు పది ఓవర్లలో 2 వికెట్ల నష్టపోయి 63 పరుగులు చేసింది. అనంతరం తుంగతుర్తి మరో పది బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. కోదాడకు చెందిన రమేష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపికయ్యాడు.