
వీ6 వెలుగు క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ రేపు మధ్యాహ్నం జరగనుంది. పుల్వామాలో టెర్రరిస్ట్ దాడి తర్వాత దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో… ఫిబ్రవరి 28న జరగాల్సిన వీ6 వెలుగు టోర్నీ ఫైనల్ మ్యాచ్ వాయిదాపడింది. కొంత వ్యవధి తర్వాత మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించిన ఆర్గనైజర్స్… గ్రాండ్ ఫినాలే తేదీని ఖరారు చేశారు. రేపు నిజామాబాద్ అర్బన్, మహబూబ్ నగర్ జట్ల మధ్య టైటిల్ ఫైట్ జరగనుంది.
ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా కేటీఆర్
మార్చి 19న అంటే రేపు మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మ్యాచ్ జరుపుతామని ప్రకటించారు. గ్రాండ్ ఫైనల్ సందర్భంగా నిర్వహించే క్లోజింగ్ సెర్మనీకి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ వెంకటస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, టోర్నమెంట్ నిర్వాహకులు, జట్ల ఆటగాళ్లు హాజరుకానున్నారు.
గ్రామీణ యువతలోనే టాలెంట్ ను వెలికి తీసే ఉద్దేశంతో వీ6 వెలుగు టీ20 క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. రాష్ట్రమంతటా ఉమ్మడి పదిజిల్లాల ప్రాతిపదికన జట్లను ఎంపిక చేసి మ్యాచ్ లు నిర్వహించారు.
