6లక్షల 50 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డ చీఫ్ ప్లానింగ్ అధికారి

6లక్షల 50 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డ చీఫ్ ప్లానింగ్ అధికారి

వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ చీఫ్ ప్లానింగ్ అధికారి లక్ష్మణ్ గౌడ్ ఏసీబీకి చిక్కారు. హైదరాబాద్ లోని కోఠీలో ఆరున్నర లక్షల లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. వేములవాడ కు చెందిన సంపత్ అనే వ్యక్తి రుద్రావరంలో 8 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమికి సంబంధించి లేఅవుట్ అనుమతి కోసం లక్ష్మణ్ గౌడ్ ను ఆశ్రయించాడు. ఈ అనుమతి మంజూరు చెయ్యాలంటే 8 లక్షలు ఇవ్వాలంటూ సంపత్ ను లక్ష్మణ్ గౌడ్ డిమాండ్ చేశాడు. చివరకు 6లక్షల 50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కోఠి హనుమాన్ వ్యాయమశాల సమీపంలోని లక్ష్మణ్ గౌడ్ ఇంటి వద్ద లంచం తీసుకొంటుండగా ACB అధికారులు లక్ష్మణ్ గౌడ్ ను పట్టుకున్నారు.