ఈ సర్కార్ బడికి ఫుల్లు డిమాండ్

ఈ సర్కార్ బడికి ఫుల్లు డిమాండ్
  • ప్రైవేటుకు ధీటుగా 300 మంది స్టూ డెంట్స్ చేరిక
  • ‘అడ్మిషన్స్ క్లోజ్డ్’ బోర్డు పెట్టిన హెచ్ ఎం

వేములవాడ, వెలుగు: సర్కారు బడులు మూత పడుతున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చందుర్తి ప్రైమరీ స్కూల్ కు మహర్దశ వచ్చింది. పిల్లలు స్కూల్లో చేరేందుకు క్యూ కట్టారు. ప్రైవేటుకు ధీటుగా ఈ ఏడాదిలో 300 మంది చేరడంతో పాఠశాల ఆవరణ కళకళలాడుతోంది. ఇంత ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ చేరడంతో క్లాస్ రూములు సరిపోయే పరిస్థితి లేక.. ‘అడ్మిషన్స్ క్టోజ్డ్’ అని పాఠశాల గేట్ వద్ద హెడ్ మాస్టర్ నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా స్టూడెంట్లు లేక బోసిపోయిన ఇదే స్కూల్లో ప్రస్తుతం పండుగ వైభవం కనిపిస్తోంది. పాఠశాల పరిరక్షణ కమిటీ, ఉపాధ్యాయ బృందం కృషికి ఫలితం దక్కింది. సర్కార్ బడికి పూర్వవైభవం రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో స్టూడెంట్లకు సరిపడే రూమ్స్ లేకపోవడంతోనే అడ్మిషన్లు క్లోజ్ చేశామని హెచ్​ఎం వీ. లక్ష్మీనారాయణ చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు చొరవ చూపి.. తరగతి గదులు పెంచేందుకు సహకరించాలని కోరుతున్నారు.