కళాఖండాల్ని వారసత్వంగా అందించాలి

కళాఖండాల్ని వారసత్వంగా అందించాలి

అరుదైన కళాఖండాల్ని వారసత్వ సంపదగా మన పిల్లలకు అందించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. న్యూబోయిన్ పల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ లో శ్రీ మహావిష్ణు మూర్తి ఏకాండీ దారుశిల్పి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహావిష్ణు కళ రూపానికి ముగ్ధుడైన ఆయన అద్భుతమైన కళా రూపానికి, ఆధ్యాత్మికత జోడించడం గొప్ప విషయమన్నారు. అన్నింటినీ వ్యాపార దృష్టితో కాకుండా కళా ఖండాన్ని రూపొందించి భావి తరాలకు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రపంచం వ్యాపారమైన ఈ రోజుల్లో కళాఖండాలు కనుమరుగు అవుతున్నాయని వివరించారు.  

మతాలు వ్యక్తిగతమైనా.. సంస్కృతి అందరికీ వర్తిస్తుందని.. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వెల్లడించారు. దేశ ప్రజలు తమ తెలివితేటలకు పదును పెట్టి కొంగొత్త ఆవిష్కరణలు చేయాలని కోరారు.  మాతృభాషలో మాట్లాడటం.. తనకు అమ్మ ప్రేమతో సమానమని అన్నారు.