నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘కస్టడీ’. మే 12న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న సందర్భంగా వెంకట్ ప్రభు మాట్లాడుతూ ‘మలయాళ సినిమా నయట్టు నుంచి ఈ స్టోరీ రాశాను. అయితే అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఇందులో వాటిని జోడించాం. పెద్ద ఆశయాలతో వున్న సాధారణ కానిస్టేబుల్ కథ ఇది. ‘లవ్ స్టోరీ’లో ఒక పాట చూసి.. ఈ పాత్రకు నాగ చైతన్య సరిపోతాడనిపించింది. ఆయనకు కూడా కథ నచ్చింది. అలాగే నిర్మాత శ్రీనివాసతో ఎప్పట్నుంచో సినిమా చేయాలనే ప్లాన్ ఉంది. అలా ఈ జర్నీ మొదలైంది.
శివ ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన కానిస్టేబుల్. తనది కాని సమస్య తను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకూ సినిమా ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్‌లా వుంటుంది. తెలుగు, తమిళ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది. స్క్రీన్ ప్లే ఫాస్ట్ ఫేస్డ్‌గా వుంటుంది. నా సినిమాల్లో హీరోలని డిఫరెంట్‌గా చూపించడానికి ఇష్టపడతాను. ఇందులో కూడా చైతు చాలా కొత్తగా కనిపిస్తారు. యాక్షన్‌ని చాలా యూనిక్‌గా డిజైన్ చేశాం. అన్నీ ఫ్రెష్ గా వుంటాయి. అరవింద్ స్వామి, శరత్‌కుమార్ పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపిస్తారు. రేవతి పాత్రలో కృతిశెట్టి అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా నెక్స్ట్ లెవల్‌లో మ్యూజిక్ ఇచ్చారు. ‘కస్టడీ’కి మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్. చాలా యూనిక్ సౌండ్ వింటారు ప్రేక్షకులు’ అని చెప్పాడు.