ఎంపీ వంశీకృష్ణను కలిసిన వెంకటాపూర్ గ్రామస్తులు.. బోర్లు వేసేందుకు ఎంపీ నిధులు మంజూరు

ఎంపీ వంశీకృష్ణను కలిసిన  వెంకటాపూర్ గ్రామస్తులు.. బోర్లు వేసేందుకు ఎంపీ నిధులు మంజూరు

పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వెల్గటూర్​ మండలం వెంకటాపూర్​ మాజీ సర్పంచ్​ రాందేని కోటయ్య..ఆ గ్రామస్థులు ఎంపీ గడ్డం వంశీకృష్ణను హైదరాబాద్​ లో కలిసారు.  తమ గ్రామ అభివృద్దిని గత బీఆర్ఎస్​ ప్రభుత్వం పట్టించుకోలేదని.. రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని .. తమ గ్రామ అభివృద్దికి ఎంపీ నిధులను కేటాయించాలని కోరారు.

గ్రామస్తులు తాగునీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నామని.. గ్రామంలో రెండు బోర్లు వేయాలని వినతిపత్రం సమర్పించగా..తమ గ్రామానికి రోడ్డు లేక చాలా ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ నిధుల నుండి రోడ్డు వేయాలని కోరారు అలాగే త్రాగు నీటి కోసం రెండు బోర్లు కావాలని కోరారు. ప్రస్తుతం గ్రామంలో తాగు నీటి ఇబ్బందులు ఉన్నాయని ఎస్సీ కాలనీలో... బీసీ కాలనీలో రెండు బోర్లు వేసేందుకు ఎంపీ ల్యాబ్స్​ నిథులను కేటాయిస్తున్నట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ తెలిపారు.  రెండు ..మూడు రోజుల్లో  బోర్లు వేస్తారని  ఎంపీ వెంకటాపూర్​ గ్రామస్తదులకు హామీ  ఇచ్చారు.

గ్రామ సమస్యలు పట్టించుకొని.. సత్వరమే తాగు నీటి ఇబ్బందులకు పరిష్కారం చూపిన ఎంపీ వంశీకృష్ణకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.