సమ్మర్ సోగాళ్ళు వచ్చేస్తున్నారు

సమ్మర్ సోగాళ్ళు వచ్చేస్తున్నారు

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన నవ్వుల నజరాన ఎఫ్2 ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న ఎఫ్ -3 రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్ చేసింది యూనిట్. మే-27న ఎఫ్-3 ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. "పిల్ల‌లు ప‌రిక్ష‌లు ముగించుకోండి..పెద్ద‌లు స‌మ్మ‌ర్ సంద‌డికై త‌యారుకండి.. ఫ‌న్ పిక్నిక్‌కు డేట్ ఫిక్స్ చేశాం" అంటూ సినిమా యూనిట్ ట్విట్ట‌ర్‌లో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో త‌మ‌న్నా, మెహ‌రిన్‌లు హీరోయిన్లుగా న‌టించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించా ఈ సినిమాలో సునీల్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.  శ్రీవెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా  షూటింగ్‌ను పూర్తి చేసుకోగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల‌లో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే విడుదల విషయంలో ఎలాంటి మార్పులేదని మరోసారి విడుదల తేదీకి  సంబంధించిన అప్డేట్ ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. విడుదల తేదీతో ఉన్న పోస్టర్ పై వెంకీ, వరుణ్ కలిసి ఉండగా.. సమ్మర్ సోగాళ్లు అని ఉంది. దీంతో ఎఫ్-2లో సంక్రాంతి అల్లుళ్లు విక్టరీ వెంకటేశ్, వరుణ్‌ తేజ్… ఈసారి సమ్మర్ సోగాళ్ళుగా మారిపోయారన్నమాట.  అయితే ఈసారి తమ హీరోలు ‘సంక్రాంతి అల్లుళ్ళు’ కాదని ‘సమ్మర్ సోగాళ్ళు’ అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతూ ట్వీట్లు వదులుతున్నారు.