కోటి రూపాయల నోటును విడుదల చేసిన ఇరాన్‌ : ముదురుతున్న ఆర్ధిక సంక్షోభం..

కోటి రూపాయల నోటును విడుదల చేసిన ఇరాన్‌ :  ముదురుతున్న ఆర్ధిక సంక్షోభం..

ఇరాన్ దేశం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం 10 మిలియన్ రియాల్స్  విలువ గల కొత్త నోటును విడుదల చేసింది. ఈ నోటు మీద 10 మిలియన్లు అని ఉన్నా, మన భారతీయ కరెన్సీలో దాని విలువ కేవలం 650 రూపాయలు మాత్రమే (అమెరికా డాలర్లలో అయితే సుమారు 7 డాలర్లు). దీనిని బట్టి ఇరాన్ కరెన్సీ విలువ ఎంతగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

ఎందుకు విడుదల చేశారంటే
 ఇరాన్ దేశంలో వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో, చిన్న చిన్న వస్తువులు కొనాలన్నా సంచుల కొద్దీ డబ్బు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని తగ్గించడానికి, తక్కువ నోట్లతో ఎక్కువ చెల్లింపులు చేసేందుకు వీలుగా ఈ పెద్ద నోటును తెచ్చారు.

ఒక పక్క  యుద్ధ భయం, మరోపక్క ఇంటర్నెట్ బంద్ వంటి కారణాలతో డిజిటల్ పేమెంట్స్ ఆగిపోతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే బ్యాంకులు, ఏటీఎంల దగ్గర డబ్బుల  కోసం జనం క్యూ కడుతన్నారు. అంతేకాకుండా చేతిలో డబ్బు ఉంచుకోవడమే సురక్షితమని  భావిస్తున్నారు.

అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఘర్షణలు, అంతర్జాతీయ ఆంక్షలు, ఇరాన్ దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి వల్ల ఇరాన్ కరెన్సీ (రియాల్)  విలువను పూర్తిగా కోల్పోతోంది. ఒక దేశం ఇంత పెద్ద విలువ గల నోటును ముద్రిస్తోందంటే, అక్కడ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉందనడానికి ఒక సంకేతం.