భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టును సోమవారం నిపుణుల బృందం పరిశీలించింది. చైర్మన్ అశోక్‌కుమార్ గంజు, రిటైర్డ్ ఎస్ఈ సంజీవ్, భవానీ రాంశంకర్(డిజైన్స్) ప్రాజెక్టును పరిశీలించి, రక్షణ చర్యలపై పలు సూచనలు చేసింది. ప్రాజెక్టు స్థిరీకరణ ఆయకట్టు, క్యాచ్మెంట్ ఏరియా, హయ్యస్ట్ ఇన్‌ఫ్లో ఇతరత్రా వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రాజెక్టు భద్రత నివేదికను తయారు చేసేందుకు ఈ నిపుణల బృందం వచ్చింది. ప్రాజెక్టులో చేపట్టాల్సిన అత్యవసర పనులపై టెక్నికల్ టీమ్ సభ్యులు ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇరిగేషన్ ఎస్ఈ ఏవీవీఎల్ నరసింహారావు, ఈఈ జానీ, డీఈ తిరుపతి, ఏఈలు సంపత్, సుమన, రవితేజ ఉన్నారు.
