హైదరాబాద్, వెలుగు: అంబికా దర్బార్ బత్తి సంస్థ తమ కొత్త ప్రొడక్ట్ "రాగస్వర సుప్ర భాతం"ను ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు అంబికా కృష్ణ, అంబికా రామ చంద్రరావు, కార్తీక్ ఆలపాటి పాల్గొన్నారు. రాగస్వర సుప్రభాతంను ప్రత్యేక మ్యూజికల్ మెకానిజంతో తీసుకొచ్చారు. అగరుబత్తి బాక్స్ తెరిచిన వెంటనే శ్రీ వేంకటేశ్వర సు ప్రభాతం స్వరాలు వినిపిస్తాయి. ఈ ప్రొడక్ట్ త్వరలో పూజా స్టోర్లు, ఆన్లైన్ ప్లాట్ఫార మ్లలో అందుబాటులోకి రానుంది.
