Batukamma Special .. తొమ్మిది రోజుల పండుగ .. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ.. ప్రత్యేకత ఏంటంటే..!

Batukamma Special .. తొమ్మిది రోజుల పండుగ ..  ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ.. ప్రత్యేకత ఏంటంటే..!

తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. ఈ పండుగ సందడి తెలంగాణలోని ప్రతి వీధిలోనూ కనిపిస్తూ ఉంటుంది.ఈ ఏడాది  బతుకమ్మ ఉత్సవాలు  ఎనిమిదో రోజు ( సెప్టెంబర్​ 28)కి చేరుకున్నాయి.  ఈ రోజున తెలంగాణ ఆడబిడ్లలంతా బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మగా ఆరాధిస్తారు.

తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో పట్టణాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పిల్లా పెద్దా అంతా ఉత్సాహంగా అమ్మను కొలుచుకుంటున్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో ఎనిమిదవ రోజుకు చాలా ప్రాధాన్యత ఉందంటున్నారు. ఈ రోజును వెన్నముద్దల బతుకమ్మగా పిలుచుకుంటారు. ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తారు.

గులాబీ, చేమంతి, తంగేడు, గునుగు, గడ్డి పూలతో బతుమ్మను పేరుస్తారు. వెన్నతో చేసిన పదార్థాల ను నివేదిస్తారు కాబట్టి 'వెన్నముద్దల బతుకమ్మ' అంటారు. ఈరోజు నైవేద్యంగా నువ్వులు, బెల్లం, వెన్న లేదా నెయ్యి కలిపిన పదార్థాలు గౌరమ్మకు సమర్పిస్తారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ తరువాత నుంచి ఒక్కో రోజు ఒక్కో వరుసను పెంచుకుంటూ బతుకమ్మను పేరుస్తారు తెలంగాణ ఆడపడుచులు. ఈరోజు ఎనిమిది వరుసలతో బతు కమ్మను త్రికోణంలో లేదా వలయాకారంలో పేరు స్తారు. బతుకమ్మ సంబరాల్లో ఎనిమిదో రోజున అమ్మను 'వెన్నముద్దల బతుకమ్మ' అని పిలుస్తారు.

మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మలు ఆడి ఆ తర్వాత నదులు, చెరువుల్లో గంగమ్మ చెంతకు బతుకమ్మలను చేరుస్తారు. ఇంటికి వచ్చాక ముత్తయిదువలకు వాయినాలు ఇచ్చి ఈరోజు (సెప్టెంబర్​ 28) వేడుకను ముగిస్తారు.

ఎంటికల దేవునికి  ఉయ్యాలో  బతుకమ్మ పాటకు  లిరిక్స్

ఎంటికల దేవునికి  ఉయ్యాలో
ఎందరమ్మ కొడుకులు ఉయ్యాలో
ఎందరెక్కడిదమ్మ ఉయ్యాలో 
ముగ్గురే కొడుకులు ఉయ్యాలో 
ముగ్గురి తోడనా ఉయ్యాలో
 ఒక్కతే అక్కమ్మ ఉయ్యాలో 
అక్కమ్మ నిచ్చిరి ఉయ్యాలో 
మా రాజు పట్నంబు ఉయ్యాలో 
పెద్దోడ పెరుమాండ్లు ఉయ్యాలో 
చెల్లెను తోలుక రార ఉయ్యాలో
నడిపోడు ఉండంగ ఉయ్యాలో
 నాకేమి అక్కెర ఉయ్యాలో
నడిపోడ నర్సింలు ఉయ్యాలో 
చెల్లెను తోలుక రారా ఉయ్యాలో 
చిన్నోడు ఉండంగ ఉయ్యాలో 
నాకేమి అక్కర ఉయ్యాలో
 చిన్నోడ శ్రీకృష్ణ ఉయ్యాలో 
చెల్లెను తీసుకరార ఉయ్యాలో 
నాయన ఉండంగా ఉయ్యాలో
 నేనెంతటోడ్ని ఉయ్యాలో
నాయనా నా తండ్రి ఉయ్యాలో
 బిడ్డను తీస్కరా ఉయ్యాలో
నాయిన్న పాయెనే ఉయ్యాలో 
మా రాజు పట్నంబు ఉయ్యాలో
 కూసుండి కోసేటి ఉయ్యాలో 
కూరముల్లు దాటి ఉయ్యాలో
 నిలుసుండి కోసేటి ఉయ్యాలో
నిలువు జొన్నదాటి ఉయ్యాలో 

వంగంగి కోసేటి ఉయ్యాలో
 వరిసేండ్లు దాటి ఉయ్యాలో
 నాయనా జేరిండు ఉయ్యాలో
 మా రాజు పట్నంబు ఉయ్యాలో 
అక్కమ్మ ఎదురొచ్చి ఉయ్యాలో
 కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో
కూసుండు నాయానా ఉయ్యాలో
 కుర్చిపీటల మీద ఉయ్యాలో
నిలుసుండు నాయనా ఉయ్యాలో 
నిలువుటద్దం ముందు ఉయ్యాలో 
పండుకో నాయనా ఉయ్యాలో
 పట్టు పరుపుల మీద ఉయ్యాలో
 పూజ చేసే ఉయ్యాలో
 ఓ అత్తగారు ఉయ్యాలో
మా నాన్న వచ్చిండు ఉయ్యాలో
 వస్తె వచ్చిరిగాని ఉయ్యాలో
ఏమేమి తెచ్చిండు ఉయ్యాలో 
పాపనికి పట్టంగి ఉయ్యాలో 
పాయిరాల కుల్ల ఉయ్యాలో
 శివునికి శీటంగి ఉయ్యాలో
 శ్రీపాయి కుల్ల ఉయ్యాలో 
నాకు నల్ల చీర ఉయ్యాలో 
నెమలి కండ్ల రవిక ఉయ్యాలో 
అతనికి అమాస ఉయ్యాలో
అంగీల జోడు ఉయ్యాలో 
నీకు పట్టుచీర ఉయ్యాలో