హీరోగా వెన్నెల కిషోర్..స్పై,యాక్షన్ ఫిల్మ్ గా చారి 111..డైరెక్టర్ ఎవరంటే?

హీరోగా వెన్నెల కిషోర్..స్పై,యాక్షన్ ఫిల్మ్ గా చారి 111..డైరెక్టర్ ఎవరంటే?

టాలీవుడ్లో ఈ తరం కమెడియన్స్ లో టక్కున గుర్తొచ్చే వారిలో వెన్నెల కిషోర్ ఒకరు.యాక్టర్ కమెడియన్ వెన్నెల కిషోర్ కమెడియన్ గా, డైరెక్టర్ గా నిరూపించుకున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వెన్నెల కిషోర్ హీరోగా రాణించడానికి ముందుకు వస్తున్నారు. ఫన్, స్పై, యాక్షన్ ఫిల్మ్ గా చారీ 111 మూవీ రాబోతుంది. టిజీ కీర్తికుమార్ డైరెక్ట్ చేయబోతున్న చారీ 111 మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు, యానిమేషన్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. 

ఈ మూవీలో వెన్నెల కిశోర్ సీక్రెట్, స్పై ఏజెంట్గా యాక్ట్ చేస్తున్నారు. స్పెషల్ గా రిలీజ్ చేసిన వీడియోలో.. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ఒక ప్రమాదం వచ్చిందంటూ స్టార్ట్ కాగా.. ఆ ప్రమాదాన్ని ఎదిరించడానికి వచ్చిన ఎస్ ఆర్మీ ఆఫీసర్ మురళీశర్మ ఏజెంట్ సంస్థకి లీడర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ కథలో విలన్స్, ప్రాబ్లమ్స్ ఉన్నట్టే..వీరిని పేస్ చేయడానికి ఒక హీరో ఉన్నాడు..అంటూ  హీరో వెన్నెల కిషోర్ను రివీల్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది. 

వెన్నెల కిశోర్ ఎంట్రీతోనే కామిక్ యాంగిల్ను చూపిస్తూ.. మూవీపై క్యూరియాసిటీ పెంచేశారు. ఎప్పుడు తన కామెడీ రోల్స్ తో నవ్వించే వెన్నెల కిషోర్..ఇప్పుడు హీరోగా వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చారీ111 మూవీలో వెన్నెల కిశోర్ క్యారెక్టర్ స్టైలిష్ గా,ఫన్ గా, గందరగోళమైన హ్యూమరస్ యాంగిల్ లో ఉంటుందని డైరెక్టర్ కీర్తికుమార్ తెలిపారు. వెన్నెల కిశోర్ కి జోడీగా సంయుక్త విశ్వనాథన్ నటిస్తుంది. త్వరలో  ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.

హీరో సుమంత్‌తో మళ్లీ మొదలయ్యింది అనే మూవీ  డైరెక్ట్ చేసిన టీజీ కీర్తి కుమార్.. చారి 111మూవీని  తెరకెక్కిస్తున్నాడు .ఈ మూవీలో మురళీ శర్మ,సత్య,బ్రహ్మాజీ,రాహుల్ రవీంద్రన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సైమన్ కే కింగ్ మ్యూజిక్ అందిస్తుండగాబర్కత్ స్టూడియోస్ బ్యానర్పై అదితి సోనీ నిర్మిస్తుంది.