ఇంధనం లేక సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన ఓడ.. ప్రమాదంలో 400మంది ప్రాణాలు

ఇంధనం లేక సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన ఓడ.. ప్రమాదంలో 400మంది ప్రాణాలు

సుమారు 400మంది వలసదారులతో వెళ్తోన్న ఓ ఓడ నడి సముద్రంలో చిక్కుకుపోయింది. దీంతో వందలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఆఫ్రికాలోని లిబియా నుంచి మధ్యదరా సముద్ర మార్గం ద్వారా 400మంది వలసదారులు అక్రమంగా దేశం దాటే ప్రయత్నాకి పూనుకున్నారు. ఈ క్రమంలోనే గ్రీస్, మాల్టా మధ్యకు చేరుకున్న ఆ ఓడలో ఇంధనం అయిపోవడంతో బోటు కెప్టెన్ కూడా అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఓడను నడపడానికి ఎవరూ లేకపోవడం, ఇంధనం అయిపోవడంతో సముద్రం మధ్యలోనే ఓడ చిక్కుకుపోయిందని అలారం ఫోన్ అనే సపోర్ట్‌ సర్వీస్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

ఓడ కింది భాగమంతా నీటితో చేరిపోవడంతో ప్రజలంతా బోటు పై భాగానికి చేరుకున్నారని, ప్రస్తుతానికి గాలికి కొట్టుకుపోతోందని అలారం ఫోన్ తెలియజేసింది. కానీ ఇప్పటికీ ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదని స్పష్టం చేసింది. అయితే ఈ బోటుకు సమీపంలోనే రెండు వాణిజ్య నౌకలున్నాయని జర్మనీకి చెంది ఎన్జీవో.. సీ వాచ్‌  ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. ఆ ఓడలను రక్షించవద్దని, ఇంధనం సరఫరా చేయాలని మాత్రమే మాల్టా అధికారులు ఆదేశించినట్లు తెలిపింది. దీనిపై వివరణ కోరడానికి అధికారులు ఎవరూ అందుబాటులోకి రాలేదని చెప్పింది. ఇదే తరహాలో ఇటీవలే ఆఫ్రికా నుంచి ఇటలీకి వలస వెళ్లడానికి కొందరు ప్రయత్నంచగా.. వారు ప్రయాణిస్తోన్న రెండు ఓడలు ట్యునీషయా ట్యునీషియా సమీపంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో22 మంది మరణించగా, నలుగులు గల్లంతయ్యారు. ఆ తర్వాత11 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించిన అధికారులు.. 440 మంది వలసదారులను రక్షించారు.