మెరుగుపడిన లతా ఆరోగ్యం.. వెంటిలేటర్ సపోర్ట్ తొలగింపు

V6 Velugu Posted on Jan 29, 2022

బాలీవుడ్ ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని డాక్టర్లు వెల్లడించారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడుతుందన్నారు. రెండు రోజుల క్రితం ఆమె వెంటిలేటర్‌ సపోర్టును తొలగించామన్నారు. ప్రస్తుతం ఆమె ICUలో డాక్టర్ల పరిశీలనలో ఉన్నారన్నారు. ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. డాక్టర్ ప్రతీత్ సందానీ నేతృత్వంలోని వైద్యబృందం లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అయోధ్యలో పలువురు స్వామిజీలు ఆమె ఆరోగ్యం కోసం మృత్యుంజయ యాగం కూడా నిర్వహించారు. 

 

Tagged lata mangeshkar health, Latha Health condition, Lata Songs

Latest Videos

Subscribe Now

More News