మేడారం జాతరకు అధికారిక సెలవు దినం ప్రకటించాలి : విశ్వహిందూ పరిషత్

మేడారం జాతరకు అధికారిక సెలవు దినం ప్రకటించాలి : విశ్వహిందూ పరిషత్
  • విశ్వహిందూ పరిషత్ డిమాండ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారక్క అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి అధికారికంగా సెలవు ప్రకటించకపోవడం విడ్డూరమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య  సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపుని ఇవ్వకపోవడం శోచనీయమని ఆయన బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడారం జాతరలో కేబినెట్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈనెల  30, 31వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అధికారిక సెలవు దినం ఎందుకు ప్రకటించలేదని  ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మక్క, సారక్క జాతరకు అధికారిక సెలవులు ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నట్టు బాలస్వామి పేర్కొన్నారు.