
సందీప్ కిషన్ హీరోగా ‘వైబ్’ అనే సినిమా రాబోతోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మిషన్ ఇంపాజిబుల్ లాంటి చిత్రాలతో మెప్పించిన స్వరూప్ ఆర్‌ఎస్‌జె దీనికి దర్శకుడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. యాక్షన్ లుక్‌లో తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి ఈ ఫస్ట్ లుక్‌లో కనిపించాడు సందీప్ కిషన్. శరీరంపై దెబ్బలు, చేతిలో ఆయుధాలతో ఏదో అల్లర్లలో పాల్గొన్నట్టుగా వీళ్లు కనిపిస్తున్నారు.
‘యుద్ధం ఎంత పెద్దదైనా, నిజమైన స్నేహితులు మీ వెంట ఉంటే మీరే ఎప్పటికీ విజేత’ అనే క్యాప్షన్ ఇచ్చారు.ఇదొక కాలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ లవ్ స్టోరీ అని, ఒక స్టూడెంట్ అతని ఫ్రెండ్స్ ఎలా రెబల్‌గా మారారు అనేది మెయిన్ కాన్సెప్ట్ అని మేకర్స్ తెలియజేశారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేస్తామన్నారు.