
- పాట్ మార్కెట్ ఘటనతో వాళ్లకు సంబంధం లేదు: బాధితుడు సాయి
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో గత నెల 30న జరిగిన ఘటనలో పాట్ మార్కెట్ మార్వాడీ వ్యాపారులకు ఎలాంటి సంబంధం లేదని బాధితుడు సాయి తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోజు తనకు, ఎస్కే జ్యువెలరీ వ్యాపారుల మధ్యే వివాదం జరిగిందన్నారు. రోడ్డుపై హారన్ కొట్టడంతో జరిగిన వివాదం.. ఎస్సీ, ఎస్టీ కేసు వరకు వెళ్లిందన్నారు.
ఈ గొడవను కొందరు తమ పాట్ మార్కెట్ వ్యాపారులతో ముడిపెట్టారన్నారు. ఈ గొడవకు, పాట్ మార్కెట్ లోని మార్వాడీ వ్యాపారులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గొడవ సమయంలో మార్వాడీలు తనకు సపోర్ట్‌గానే ఉన్నారని చెప్పారు. కొందరి కారణంగా సోషల్‌మీడియాతో పాటు మీడియాలోనూ తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని పేర్కొన్నారు.