చిత్రపురి కాలనీ స్కాంలో న్యాయం చేయండి: బాధితులు

చిత్రపురి కాలనీ స్కాంలో న్యాయం చేయండి: బాధితులు

చిత్రపురికాలనీ స్కాంలో తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బాధితులు. ప్లాట్ అలాట్మెంట్ కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు డబ్బు కడితే.. ఎవరో తెలియని వ్యక్తులకు ఇళ్లు కేటాయించారని తెలిపారు.ఒకటే ప్లాట్ ఇద్దరు, ముగ్గురికి కేటాయించారన్నారు. ఇందులో ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. 

అధికారుల అకౌంట్స్ లోకి డబ్బులు వెళ్లాయని, దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని సమర్ధించిందని, కానీ కాంగ్రెస్ హయాంలో చిత్రపురికాలనీ ప్లాట్ల కేటాయింపుల్లో జరిగిన స్కాం బయటపడిందని తెలిపారు.ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు బాధితులు.