రిసెప్షనిస్ట్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్న పుల్కిత్ ఆర్య

రిసెప్షనిస్ట్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్న పుల్కిత్ ఆర్య

ఉత్తరాఖండ్ లో మృతిచెందిన రిసెప్షనిస్ట్ అంకితా భండారి (19) అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు మార్చురీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రిసెప్షనిస్ట్ మృతికి నిరనసగా శ్రీనగర్ మార్చురీ దగ్గర స్థానికులు ఆందోళన చేపట్టారు. శ్రీనగర్-కేదార్ నాథ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోస్ట్మార్టం తర్వాత అంత్యక్రియల కోసం డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు మార్చురి దగ్గరికి చేరుకున్నారు.

రిసెప్షనిస్ట్ ను హత్య చేసినట్లు ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య అంగీకరించటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. రిసెప్షనిస్ట్ డెడ్ బాడీపై గాయాలున్నట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. పోస్ట్ మార్టం నివేదిక సీల్ట్ కవర్ లో సమర్పించాలన్నారు జిల్లా మెజిస్ట్రేట్. నలుగురు డాక్టర్ల బృందం పోస్ట్ మార్టం నిర్వహించింది. పోస్టుమార్టం తర్వాత యువతి భౌతికకాయాన్ని NIT ఘాట్ కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

సెప్టెంబర్ 18న అదృశ్యం 

పుల్కిత్ ఆర్యకు రిషికేశ్‌ నగరంలో వనతార పేరు ఒక రిసార్ట్‌ ఉంది. ఇందులో అంకితా భండారి రిసెప్షనిస్టుగా పని చేసేది. సెప్టెంబర్ 18వ తేదీన ఆమె అదృశ్యమైంది. దీంతో  అంకిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యను ప్రధాన నిందితుడిగా తేల్చారు. ఓ వివాదం కారణంగా అంకితా భండారిని చిల్లా కాలువలోకి అతడు తోసేసినట్లు నిందితులు పోలీసు విచారణలో చెప్పారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం వనతార రిసార్ట్‌ను కూల్చేయాలని ఆదేశించింది. సీఎం ఆదేశాల మేరకు బుల్డోజర్లతో పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్టును కూల్చేశారు.