చిరంజీవి మూవీలో వెంకటేష్

చిరంజీవి మూవీలో వెంకటేష్

స్టార్ హీరో అయ్యుండి కూడా తరచుగా ఇతర హీరోలతో స్క్రీన్‌‌‌‌‌‌‌‌ షేర్ చేసుకుంటూ ఉంటారు వెంకటేష్‌‌‌‌‌‌‌‌. మల్టీస్టారర్స్ చేయడానికి ఎప్పుడూ ముందుండే ఆయన.. ఇప్పటికే సల్మాన్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ మూవీ ‘కభీ భాయ్ కభీ జాన్‌‌‌‌‌‌‌‌’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలోనూ యాక్ట్ చేయడానికి ఎస్ చెప్పారంటూ వార్తలు వస్తున్నాయి. చిరంజీవి హీరోగా బాబి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తెరకెక్కుతోంది. శ్రుతీ హాసన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. రవితేజ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. మరో పాత్రలో వెంకటేష్ కూడా నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కేవలం గెస్ట్ రోల్ అని, క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌లో మాత్రమే వెంకీ కనిపిస్తారని అంటున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి మొదట్లో సాధారణ వ్యక్తిగా కనిపిస్తారని, తర్వాత ఆయనో పోలీస్ అని రివీల్ అవుతుందని ఆమధ్య వార్తలొచ్చాయి. అది నిజం కాదని, ఆయన దొంగగాను.. రవితేజ పోలీసుగాను నటిస్తున్నారని ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది. వీటిలో ఎంత నిజముందో, వెంకీ నిజంగా నటిస్తున్నారో లేదో ఎవరైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.