వరుసగా రెండోసారి విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీ సెమీఫైనల్ కు విదర్భ

వరుసగా రెండోసారి విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీ సెమీఫైనల్ కు  విదర్భ

బెంగళూరు: ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో చెలరేగిన విదర్భ.. వరుసగా రెండోసారి విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో యష్‌‌‌‌‌‌‌‌ రాథోడ్‌‌‌‌‌‌‌‌ (86), బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో నచికేత్‌‌‌‌‌‌‌‌ భూటే (4/51) రాణించడంతో.. మంగళవారం జరిగిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో 76 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఢిల్లీపై గెలిచింది. 

టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన విదర్భ 50 ఓవర్లలో 300/9 స్కోరు చేసింది. అథర్వ తైడ్‌‌‌‌‌‌‌‌ (62), ధ్రువ్‌‌‌‌‌‌‌‌ షోరే (49), రవికుమార్‌‌‌‌‌‌‌‌ సమర్థ్‌‌‌‌‌‌‌‌ (23) రాణించారు. యష్‌‌‌‌‌‌‌‌ కడం (19), రోహిత్‌‌‌‌‌‌‌‌ బింకర్‌‌‌‌‌‌‌‌ (15) మోస్తరుగా ఆడారు. ఇషాంత్‌‌‌‌‌‌‌‌ శర్మ, నవ్‌‌‌‌‌‌‌‌దీప్ సైనీ, ప్రిన్స్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, నితీశ్‌‌‌‌‌‌‌‌ రాణా తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ 45.1 ఓవర్లలో 224 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. అనూజ్‌‌‌‌‌‌‌‌ రావత్‌‌‌‌‌‌‌‌ (66) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. వైభవ్‌‌‌‌‌‌‌‌ (28), ప్రియాన్షు ఆర్యా (28), హర్ష్‌‌‌‌‌‌‌‌ త్యాగీ (27), హ్రితిక్‌‌‌‌‌‌‌‌ షోకిన్‌‌‌‌‌‌‌‌ (21) పోరాడి విఫలమయ్యారు. హర్ష్‌‌‌‌‌‌‌‌ దూబే 3, ప్రఫూల్‌‌‌‌‌‌‌‌ హింగే 2 వికెట్లు పడగొట్టారు. యష్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. గురువారం జరిగే సెమీస్‌‌‌‌‌‌‌‌లో విదర్భ.. కర్నాటకతో తలపడుతుంది.