ఈ యాంకర్ అదరలేదు.. బెదరలేదు.. భూకంపానికి ఊగుతున్నా..

ఈ యాంకర్ అదరలేదు.. బెదరలేదు.. భూకంపానికి ఊగుతున్నా..

తైవాన్ దేశాన్ని భారీ భూకంపం వణికించింది. బిల్డింగ్స్ అన్నీ ఊగిపోయాయి. 7.4 తీవ్రతతో భూకంపం రావటంతో.. 40 సెకన్లు బిల్డింగులు అన్నీ కూలిపోతాయా అన్నట్లు ఊగిపోయింది దేశం.. ఇలాంటి పరిస్థితుల్లోనూ.. న్యూస్ టీవీ ఛానెల్ స్టూడియోలో లైవ్ వార్తలు చదువుతున్న యాంకర్ అదరలేదూ.. బెదరలేదూ.. ఈ వీడియోనే ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

తైవాన్ లోని సెట్ ఐ న్యూస్ అనే 24 గంటల న్యూస్ ఛానెల్. ఉదయం 7 గంటల 59 నిమిషాలు. స్టూడియో యాంకర్ వార్తలు చదువుతున్న సమయంలో భూకంపం వచ్చింది. దీంతో స్టూడియోలోని లైట్లు అన్నీ ఊగిపోయాయి. బిల్డింగ్ మొత్తం ఊగిపోయింది.. కెమెరాలు అటూ ఇటూ కదిలిపోయాయి.. ఆ న్యూస్ స్టూడియోలోని సిబ్బంది కూడా కొందరు బయటకు పరుగులు తీశారు. స్టూడియోలోని యాంకర్ మాత్రం అస్సలు అదరలేదు.. బెదరలేదు.. ఏ మాత్రం భయపడకుండా వార్తలు చదువుతూనే ఉంది. ఏ మాత్రం భయపడలేదు.. మధ్యలో ఆపను కూడా ఆపలేదు.. భూకంపం ధాటికి ఊగిపోతున్నా.. అక్షరం పొల్లుపోకుండా చదువుతూనే ఉంది.. 

ఇదే సమయంలో భూకంపం ధాటికి స్టూడియోలోని సీలింగ్ కు ఉన్న లైట్లు ఊగిపోవటాన్ని కెమెరామెన్ చూపించాడు. ఆ సమయంలో యాంకర్ లో ఏ మాత్రం బెదురులేదు.. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ తిరిగేస్తుంది.. మీరూ చూసేయండి..

ALSO READ :- వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ