దీని ముందు ఫ్లైట్ కూడా వేస్టేనా.. భారీ కారుతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోన్న షేక్

దీని ముందు ఫ్లైట్ కూడా వేస్టేనా.. భారీ కారుతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోన్న షేక్

సోషల్ మీడియాలో ఓ భారీ హమ్మర్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో షేర్ కావడంతో నెటిజన్లంతా షాక్ అవకుండా ఉండలేకపోతున్నారు. మాసిమో అప్ లోడ్ చేసిన ఈ వీడియోలో భారీ హమ్మర్ ముందు పార్క్ చేసిన రెండు కార్లు.. అది ఎంత పెద్దగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. అత్యంత వింతగా కనిపించే అసలు నిజమైనదేనా అని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ అందులో డౌట్ అక్కర్లేదు. ఇది నిజమైన కారే. వివరాల్లోకి వెళితే..

ఈ భారీ హమ్మర్ దుబాయ్ కి చెందిన షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్వాన్ కు చెందింది. ఇతన్ని రెయిన్‌బో షేక్ అని కూడా పిలుస్తారు. దుబాయ్ రెయిన్‌బో షేక్ వద్ద భారీ హమ్మర్ H1.. సాధారణ H1 హమ్మర్ కంటే మూడు రెట్లు పెద్దది. ఇక దీని పొడవు విషయానికొస్తే 184.5 అంగుళాలు, ఎత్తు 77 అంగుళాలు, వెడెల్పు 865 అంగుళాలు. దుబాయ్ కి చెందిన ఈ బిలియనీర్.. హమ్మర్ చిన్నదిగా భావించి.. సేమ్ ఇదే తరహాలో అతిపెద్ద అడాప్టివ్ హమ్మర్ హెచ్ 1ని రూపొందించారట.

దుబాయ్‌లో భారీ హమ్మర్‌తో కూడిన వీడియో నెటిజన్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది. "మీరు డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు రహదారిని మూసివేయాలి ?? " అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా.. "నేను దీన్ని ఎక్కడ పొందగలను?" అని మరో ట్వీట్ చేశారు. 

Dubai Rainbow Sheikh’s giant Hummer H1 “X3” is three times bigger than a regular Hummer H1 SUV (14 meters long, 6 meters wide, and 5.8 meters high). The Hummer is also fully drivable

[read more: https://t.co/LlohQguhTM]pic.twitter.com/uV1Z4juHKx

— Massimo (@Rainmaker1973) July 27, 2023