పాకిస్తాన్​లో ట్రెండ్ అవుతోన్న మోడీ వీడియో

పాకిస్తాన్​లో ట్రెండ్ అవుతోన్న మోడీ  వీడియో
  • ఇమ్రాన్​ ఖాన్​ పార్టీ నేతల ప్రచారం
  • పాకిస్తాన్​లో మోడీ వీడియో వైరల్​

న్యూఢిల్లీ: మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం వీడియో పాకిస్తాన్​లో ట్రెండ్ అవుతోంది. పాక్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ఆ దేశ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ విధానాలే కారణమంటూ మాజీ పీఎం ఇమ్రాన్​ఖాన్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజస్థాన్​లో మోడీ మాట్లాడిన వీడియోను పాకిస్తాన్​ తెహ్రీక్​ ఇ ఇన్సాఫ్(పీటీఐ)​ నేతలు షేర్ చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం సిగ్గుపడాలంటూ కామెంట్లు పెడ్తున్నారు. ప్రధాని పదవి నుంచి షెహబాజ్ దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆ వీడియోలో ఏముందంటే.. 

2019 ఎన్నికలపుడు పాకిస్తాన్​పై విమర్శలు చేస్తూ రాజస్థాన్‌‌లోని బార్మర్‌‌లో మోడీ మాట్లాడిన వీడియోను పీటీఐ నేత అజంఖాన్  సోమవారం ట్వీట్ చేశారు. ఆ వీడియోలో.. ‘‘పాక్​ అహంకారాన్ని అణిచేసినం. ప్రపంచమంతటా తిరిగి అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చినం. ఆ దేశ బెదిరింపులకు భయపడే పరిస్థితిని తప్పించాం. వాళ్ల దగ్గర న్యూక్లియర్ వెపన్లుంటే.. మాదగ్గరున్నవాటిని దీపావళి కోసం దాచుకున్నమా?” అని మోడీ అన్నట్లుగా ఉంది. అయితే, 2019లో ఇమ్రాన్ అధికారంలో ఉన్నప్పుడే మోడీ ఈ మాటలన్నారని పలువురు కౌంటర్ ఇస్తున్నారు. మోడీ చెప్పింది మిమ్మల్ని ఉద్దేశించే, జర చూస్కోండి అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.