హిమాచల్ లో అరుదైన పాము.. శ్వేతనాగేనా?

హిమాచల్ లో అరుదైన పాము.. శ్వేతనాగేనా?

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో అరుదైన జాతి పాము కనిపించడంతో స్థానికుల్లో ఉత్సుకత, భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల సమయంలో అల్బినో జాతికి చెందిన ఈ పాము ప్రత్యక్షమైంది. 

ఈ రకం పాముకి నిర్దిష్ట రంగు ఉండదు.  శరీరం,  కళ్లు తరచూ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు మారుతుంటాయి. అంటే శ్వేత నాగు కాదన్నమాట.  కానీ ఇవి అరుదైన జాతుల కేటగిరీలోకి వస్తాయి. 

స్థానికులు పాము కదలికల వీడియోను రికార్డ్ చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తెల్లని రంగులో ఉన్న ఈ పాము అడవిలో వెళ్తుండగా కొందరు వీడియో తీశారు.   

అటువంటి అరుదైన జాతుల పాములను రక్షించాలంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  గత మే నెలలో, కోయంబత్తూర్‌లోని పోదనూరు నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన 5 అడుగుల పొడవున్న అరుదైన అల్బినో కోబ్రాను అధికారులు రక్షించారు.   జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు దాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌లో వదిలిపెట్టారు.