
న్యూఢిల్లీ: నెమళ్లను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా వర్షంలో తడుస్తూ నెమలి చేస్తే నాట్యం, పురివిప్పి ఉండే పికాక్ ఫొటోస్‌ను చాలా మంది ఇళ్లల్లో పెట్టుకుంటారు. అయితే అడవుల్లో ఉండాల్సిన నెమళ్లు చెట్ల నరికివేత, అడవుల విస్తీర్ణం తగ్గడంతో సరిహద్దు గ్రామాలకు వచ్చేస్తున్నాయి. ఇక వేటగాళ్ల చేతుల్లో బలయ్యే నెమ్మళ్ల సంఖ్య చాలానే ఉంది. ఈ నేపథ్యంలో ఇలా ఆకలితో ఉన్న ఓ నెమలికి కూరగాయలు అమ్ముకునే మహిళ గింజలు తినిపించడం వైరల్ అవుతోంది. ఈ వీడియో కనిపిస్తున్న నెమలి అందంగా ఉండి నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుండగా.. నెమలికి గింజలు తినిపిస్తున్న మహిళ ఔదార్యాన్ని సోషల్ మీడియాలో యూజర్లు మెచ్చుకుంటున్నారు.
She is rich by heart ❤️ pic.twitter.com/q1bOLbdXO0
— Tinku_Venkatesh | ಟಿಂಕು ವೆಂಕಟೇಶ್ (@tweets_tinku) August 1, 2020
టింకూ వెంకటేశ్ అనే ఓ ట్విట్టర్ యూజర్ సదరు వీడియోను పోస్ట్ చేశాడు. దీనికి ఆమె మనసు చాలా గొప్పది అనే క్యాప్షన్‌ను జత చేశాడు. రోడ్ సైడ్ వెజిటేబుల్స్ అమ్ముకుంటున్న మహిళ దగ్గరకు పికాక్ రావడం, దాన్ని పిలిచి ఆమె కొన్ని గింజలు తినిపించడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో నెట్‌లో పోస్ట్ అయినప్పటి నుంచి 3.8 లక్షల మంది దీన్ని చూడటం గమనార్హం. 5,100 లైక్‌లతోపాటు 1,200 రీట్వీట్స్ చేయడం విశేషం. ఈ వీడియోను పలువురు చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ఆత్మ స్వచ్ఛమైనదని కొందరు ట్వీట్ చేయగా.. పికాక్ ఇన్నోసెన్స్‌ను చూడండంటూ మరికొందరు ట్వీట్ చేశారు.