
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో మరో ఫీచర్ యాడ్ కానుంది. వాట్సాప్‌లో బోలెడన్ని వీడియోస్ వస్తుంటాయి. వాటిలో కొన్ని ఎక్కువ మెమరీతో ఉంటాయి. దీంతో వాటిని డౌన్‌లోడ్ చేస్తే మొబైల్ డాటా త్వరగా అయిపోవచ్చు. ఈ ఇబ్బందిని తొలగించేలా వాట్సాప్ కొత్త అప్‌డేట్ తీసుకొస్తోంది. ఇకపై యూజర్స్ వీడియో పంపేముందు వీడియో క్వాలిటీని మార్చుకోవచ్చు. అంటే వీడియో క్వాలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అవసరమనుకుంటే తగ్గించుకోవచ్చు. రిసీవర్స్‌కు పంపేముందు, వాళ్లు హై క్వాలిటీ వీడియో డౌన్‌లోడ్ చేసుకోలేరు అనుకుంటే, వీడియో క్వాలిటీ తగ్గించి పంపించొచ్చు. వాట్సాప్‌లో ఇప్పటికే డాటా సేవర్ ఆప్షన్ ఉన్నా, అది అన్ని ఫైల్స్‌కు పనిచేస్తుంది. కానీ, ఎక్కువ క్వాలిటీ ఉండే వీడియోలకు మాత్రమే విడిగా పనిచేయదు. కానీ, కొత్తగా రాబోతున్న ఫీచర్ ద్వారా ఎక్కువ మెమరీ ఉన్న వీడియోలను కూడా తక్కువ డాటాతో పంపించవచ్చు. ఇది వీడియో పంపించే వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. వాట్సాప్‌లో ‘వ్యూ వన్స్’ అనే ఫీచర్ త్వరలో వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా సెండర్ పంపిన మెసేజ్‌ను రిసీవ్ చేసుకున్న వాళ్లు ఒక్కసారి చూడగానే ఆ మెసేజ్ డిలీట్ అయిపోతుంది.