గోవా టూర్ క్యాన్సిల్ చేసుకున్న ముగ్గురు ఫ్రెండ్స్ ..ఆ తర్వాత ఏం జరిగింది..?

గోవా టూర్ క్యాన్సిల్ చేసుకున్న ముగ్గురు ఫ్రెండ్స్ ..ఆ తర్వాత ఏం జరిగింది..?

ఎక్కడైనా లాంగ్ టూర్ కు ప్లాన్ చేసినప్పుడు మనలో చాలామంది ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. టూర్ కు వెళ్లే ముందుు అన్ని ప్రిపేర్ చేసుకుంటారు. కొత్త బట్టలు, బ్యాగులు, షూస్... ఇంకా కావాల్సినవన్నీ కొనుక్కుని రెడీగా పెట్టుకుంటారు. ఎవరి వీలు, బడ్జెట్ బట్టి.. ట్రైన్, లేదా విమానం, కారు, లేదా ఏదైనా ప్రైవేటు వాహనాల్లో వెళ్దామని ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అందరూ కలిసి వెళ్తే ఆ హుషారే వేరబ్బా. 

అనుకున్న సమయం ప్రకారం.. ముందుగా ప్లాన్ ప్రకారం.. మన స్నేహితుల్లో ఎవరైనా హ్యాండ్ ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంటి..? టిక్కెట్లు బుక్ చేసుకున్న తర్వాత కూడా ఆఖరిక్షణంలో ట్రిప్ కు ప్లాన్ చేసిన వారిలో కొంతమంది రాకపోతే.. మిగతా వాళ్లకు ఎలా ఉంటుంది..? ఈ స్నేహితులకు మాత్రం బాగా కాలింది. 

గోవా టూర్ కు ప్లాన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ లో కొంతమంది రాకపోయేసరికి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కు చిరాకు వచ్చింది. అందుకే చాలా డిఫరెంట్ గా.. ఎవరికీ రాని ఐడీయా వీళ్లకు వచ్చింది. ఇంకేముందు.. అనుకున్నట్లుగా గోవా టూర్ కు సిద్ధమయ్యారు. ఆఫీసులో సెలవులు ఇవ్వని కారణంగా.. మిగతా వాళ్లు టూర్ కు వెళ్లలేదు. 

మొత్తం ఐదుగురు ఫ్రెండ్స్ గోవాకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. చివరి క్షణంలో ముగ్గురు తమ టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఒకరు.. ఆఫీసులో లీవ్ ఇవ్వనందుకు మరొకరు.. ఇంకొకరు తన వ్యక్తిగత కారణాలతో టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయినా.. మిగతా  ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం ఎలాగైనా గోవా వెళ్లాలనుకున్నారు. ప్లాన్ ప్రకారం టూర్ కు సిద్ధమయ్యారు. 

గోవా ట్రిప్ లో తమ టూర్ ను రద్దు చేసుకున్న ఫ్రెండ్స్ ఫొటోలను తమ వెంట తీసుకెళ్లారు. ట్రైన్ లో వాళ్లకు కేటాయించిన రిజర్వ్ సీట్లలో వారి ఫొటోలను ఉంచి.. మిగతా సీట్లలో ఇద్దరు స్నేహితులను కూర్చున్నారు. చివరకు గోవాలో ఉన్నన్నీ రోజులు వారి ఫొటోలను తమ వెంట తీసుకెళ్లారు. చివరకు హోటల్ కు కూడా వెళ్లిన సమయంలో ముగ్గురు ఫ్రెండ్స్ ఫొటోలను చైర్లలో ప్రదర్శించారు. 

గోవాకు బయలుదేరే ముందు నుంచి ఇంటికి తిరిగి వచ్చే వరకూ వారు గడిపిన మధర క్షణాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఎడిటింగ్ చేసిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. చాలామంది నెటిజన్లను ఆకర్షిస్తోంది. అంతేకాదు.. ఆలోచింపజేస్తోంది. దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ తో కేక పుట్టిస్తున్నారు. నిజమే కదా.. మనకు కూడా కొన్నిసార్లు ఇలాంటి అనుభవమే ఎదురైందని కామెంట్స్ చేస్తున్నారు. ‘‘చాలా ఫన్నీగా ఉంది బ్రో. ఇలాంటి ఐడీయాలు మీకు ఎక్కడి నుంచి వస్తాయ్’’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.