ట్రయల్ రూమ్​లో మొబైల్​తో వీడియోలు

ట్రయల్ రూమ్​లో మొబైల్​తో వీడియోలు
  • జూబ్లీహిల్స్​లోని ఓ షాపింగ్ మాల్​లో ఘటన
  • ఇద్దరు యువకుల అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: షాపింగ్ మాల్​లోని  మహిళల ట్రయల్ రూమ్​లో మొబైల్ తో వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్​కి చెందిన ఓ యువతి గురువారం సాయంత్రం రోడ్ నం.10లోని హెచ్ అండ్ ఎం మాల్​లో షాపింగ్​కు వెళ్లింది.  విమెన్స్ ట్రయల్ రూమ్​లోకి వెళ్లి  డ్రెస్ మార్చుకుంటుండగా.. మెన్స్ ట్రయల్ రూమ్ పార్టిషన్​ పై ఎవరో సెల్​ఫోన్ పెట్టి వీడియో తీస్తుండటాన్ని గుర్తించింది. యువతి అరవడంతో షాపింగ్ మాల్​లోని కస్టమర్లు, ఓనర్ అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకుని ఇద్దరు యువకులను పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని వీడియోలు తీసిన  కిరీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(24), గౌరవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(23)ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లను స్వాధీనం చేసుకుని వీడియోలను డిలీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. యువకుల మొబైల్స్ లో ఇలాంటి వీడియోలు మరికొన్ని ఉన్నట్లు గుర్తించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టోర్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు ఫైల్ చేశారు. షాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ట్రయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెస్టారెంట్లలో వాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్ళిన సమయాల్లో పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించాలని పోలీసులు సూచిస్తున్నారు.