నా మొదటి సంపాదన రూ.500

నా మొదటి సంపాదన రూ.500

బాలీవుడ్ నటి విద్యాబాలన్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ తో  తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. డర్టీ పిక్చర్, కహానీ, శకుంతల దేవీ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇపుడు తన నెక్స్ట్ మూవీ షెర్ని విడుదలకు రెడీగా ఉంది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. ఈ సందర్బంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విద్యాబాలన్ తన మొదటి సంపాదన గురించి చెప్పింది. ఓ టూరిస్ట్ క్యాంపెయిన్ కోసం నిర్వహించిన ఫోటో షూట్ లో పాల్గొన్నందుకు తనకు రూ.500 ఇచ్చారని చెప్పింది. తన సోదరి, కజిన్ అతని ఫ్రెండ్ తో కలిసి ఫోటో షూట్ లో పాల్గొన్నామని చెప్పింది. తామంతా ఓ చెట్టుపక్కన నిలబడి నవ్వుతూ ఉండాలని... అలా నవ్వినందుకు ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చారని చెప్పింది. అదే తన మొదటి సంపాదన అని తెలిపింది విద్యాబాలన్ .
అలాగే తాను ఇండస్ట్రీకి  వచ్చిన  రోజులను గుర్తుచేసుకుంది. తన మొదటి అడిషన్ విషయాల గురించి చెప్పిన విద్యాబాలన్ ఓ టెలివిజన్ షో గురించి తన అమ్మ, సోదరితో కలిసి ఫిలీం సిటీకి వెళ్లామని చెప్పింది. అక్కడ 150 మంది అడిషన్ కోసం వేచిచూస్తున్నారని చెప్పింది. అలా అక్కడ రోజంతా కూర్చొని ఉన్నామని..అంతమందిని చూసి తనకు చాన్స్ రాదేమోనని అనుకున్నట్టు తెలిపింది. అయితే అదృష్టం కొద్ది తనకు టెలివిజన్ షోలో నటించే చాన్స్ వచ్చిందని చెప్పింది విద్యాబాలన్.