2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి : విద్యార్థి సేన

2 లక్షల ఉద్యోగాలతో  జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి : విద్యార్థి సేన

సైఫాబాద్, వెలుగు: 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్​చేయాలని విద్యార్థి సేన డిమాండ్ చేసింది. సోమమవారం అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థి సేన నాయకులు నిరసన తెలిపారు.  

అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ.. నిరుద్యోగుల వల్లే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని విస్మరిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులను చైతన్యం చేసేందుకు నిరుద్యోగ పోరుబాట కార్యక్రమాన్ని జులై 31 వరకు నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికీ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఆగస్టు 6న అమరవీరుల స్తూపం నుంచి వేలాది మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.