
హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్లో విజ్ఞాన్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 70వ ర్యాంకు సాధించిందని ఆ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ పి.నాగభూషణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలోనూ 80వ ర్యాంకు సాధించిందని ఆయన చెప్పారు. విజ్ఞాన్ కు ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకు లభించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఏజెన్సీల నుంచి గ్రాంట్లు అందుతాయని తెలిపారు. అంతేకాకుండా ప్రముఖ ఎంఎన్ సీ కంపెనీలు కూడా వర్సిటీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు.
ఈ ర్యాంకు సాధించేందుకు ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్లే కారణమని వీసీ పేర్కొన్నారు. కాగా, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడానికి కృషి చేసిన ఐక్యూఏసీ టీంను విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయ, నాగభూషణ్, సీఈఓ డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పీఎంవీ రావు అభినందించారు.