బిచ్చగాడు రీ రిలీజ్.. డేట్ కూడా వచ్చేసింది

బిచ్చగాడు రీ రిలీజ్.. డేట్ కూడా వచ్చేసింది

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలిజ్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ గా నిలిచినా సినిమాలను ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మేకర్స్. వాటిలో కొన్ని సినిమాలు అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతుంటే.. మరికొన్ని మాత్రం నిరాశ పరుస్తున్నాయి. ఇక రీసెంట్ గా రీ రిలీజైన మహేష్ బాబు బిజినెస్‌మెన్, నాగార్జున మన్మదుడు సినిమాలు సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. ఇదే ఊపులో మరికొన్ని సినిమాలు కూడా రీరిలిజ్ సిద్దమవుతున్నాయి. 

ALSO READ: అల్లు అర్జున్ అభిమాని మృతి.. చివరికోరిక తీర్చడానికి సిద్దమైన ఐకాన్ స్టార్.. కానీ! 

అందులో తమిళ హీరో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమా ఒకటి. 2016లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. తెలుగులో ఈ సినిమాపై కేవలం రూ.50 లక్షలు ఖర్చు చేయగా.. లాంగ్ రన్ ఏకంగా రూ.25 కొట్ల షేర్‌‌.. రూ.43 కొట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. సెప్టెంబర్ 15న రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అప్పట్లో చిన్న డబ్బింగ్ సినిమాగా రిలీజై సంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి మరి.