కార్మిక పక్షపాతి గడ్డం వివేక్ : విజయ్భాస్కర్

కార్మిక పక్షపాతి గడ్డం వివేక్ : విజయ్భాస్కర్
  • మాల విద్యుత్​ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్​భాస్కర్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కార్మిక పక్షపాతి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అని జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూరుగు విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఐఎన్‌‌‌‌టీయూసీ ఆఫీసులో  సోమవారం శ్రమ శక్తి అవార్డు గ్రహీతలను యూనియన్ నేతలు సన్మానించారు.

అవార్డులు అందుకున్న పాల్వంచ కేటీపీఎస్‌‌‌‌కు చెందిన బూరుగుల విజయ భాస్కర్, వైటీపీఎస్ పవర్ ప్లాంట్‌‌‌‌కు చెందిన ఎం.ఎ.మజీద్, పీతాంబరం, సింగరేణి కార్మికుడు మహబూబ్‌‌‌‌ను సత్కరించారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ మాట్లాడుతూ, గతంలో కేంద్ర మంత్రిగా కాకా కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన కొడుకు గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా అదే తరహాలో ముందుకెళ్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్‌‌‌‌టీయూసీ యూనియన్ రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొన్నారు