కోహ్లీ బయోపిక్ లో నటిస్తా

కోహ్లీ బయోపిక్ లో నటిస్తా

దాయాదుల పోరుకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఆసియాకప్ లో భాగంగా దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్లో అర్జున్ రెడ్డి సందడి చేశాడు. లైగర్ మూడీ ప్రమోషన్స్‌లో భాగంగా .. మ్యాచ్‌కు ముందు హోస్ట్‌లతో కలిసి విజయ్ మాట్లాడాడు. పాక్ పై భారత్ గెలుస్తుందని..ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తుందని విజయ్ జోస్యం చెప్పాడు. భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌తో సరదాగా చిట్ చాట్ చేశాడు. 

కోహ్లీ బయోపిక్ లో నటిస్తా..
స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానెల్‌తో చిట్ చాట్ చేసిన విజయ్ దేవరకొండ.. దుబాయ్‌లో ఉన్న పరిస్థితిని తెలుగు కామెంటేటర్లతో పంచుకున్నాడు. భారత్ పాకిస్తాన్ ప్రేక్షకులతో స్డేడియం ఫుల్ అయిందని..అభిమానుల మధ్య  మ్యాచ్ చూస్తుంటే ఆనందంగా ఉందన్నాడు. జాతీయగీతం వచ్చినప్పుడు తనకు గూస్‌బంప్స్ వచ్చాయన్నాడు. అటు కోహ్లీ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని చెప్పాడు. 83 మూవీలో కృష్ణమాచారి కారెక్టర్  కోసం తనను అడిగారని..అప్పుడు కుదరలేదని తెలిపాడు.  

ఫ్యాన్స్ హ్యాపీ..
భారత్ పాక్ మ్యాచ్ను చూస్తూ సంబరపడ్డ ఫ్యాన్స్ ..విజయ్ దేవరకొండను చూసి మరింత సంతోషం వ్యక్తం చేశారు. రౌడీ హీరోను చూసి గర్వపడుతున్నామని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. 

ప్రమోషన్స్ లో బిజీ..
పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో.. రౌడీ స్టార్ విజయ్ ​దేవరకొండ లైగర్ మూవీలో నటించాడు.  ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న ఈ మూవీ రిలీజైంది. తొలి రోజు నుంచి ఫ్లాప్​టాక్ను మూటగట్టుకుంటుంది. కానీ బాలీవుడ్‌లో మంచి టాక్ రావడంతో విజయ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు.