
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ నటిస్తున్న 12వ సినిమా ఇది. ‘వీడీ 12’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే శ్రీలంకలో ఒక షెడ్యూల్‌ను ముగించుకున్న టీమ్.. తాజాగా కేరళలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అక్కడి ఫ్యాన్స్‌తో మీట్ అయ్యాడు. ‘కేరళలోని అందమైన లొకేషన్స్ మధ్య షూటింగ్ జరగడం ఆనందంగా ఉంది. ఇక్కడ ఎక్కువ భాగం యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. చాలా ఎక్సయిటింగ్‌గా ఉన్నా’ అని చెప్పాడు.
అలాగే చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యింది. ‘అభిమానులకు, ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడానికి టీమ్ అంతా కష్టపడుతోంది. ఈ షెడ్యూల్‌తో దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయింది. దయచేసి లీక్ అయిన ఫొటోలను ఎవరూ షేర్ చేయొద్దు’ అని పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో విజయ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన తన లుక్ అంచనాలు పెంచింది. మార్చి 28న సినిమా విడుదల కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.