
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కింగ్‌డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ నెల 31న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
అయితే ఈ చిత్రాన్ని హిందీలో ‘సామ్రాజ్య’ టైటిల్‌తో రిలీజ్ చేయబోతున్నట్టు శనివారం టీమ్ ప్రకటించింది. ‘కింగ్‌డమ్’ టైటిల్ హిందీలో అందుబాటులో లేకపోవడంతో ‘సామ్రాజ్య’గా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. ఇందులో విజయ్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.