ఓటీటీలో ఆ మజా ఉండదు.. అందుకే నేను చేయను

ఓటీటీలో ఆ మజా ఉండదు.. అందుకే నేను చేయను

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీల హవా నడుస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా స్టార్ హీరోలు సైతం ఓటీటీలో చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇండియా నుండి హిందీ, తమిళ్, మలయాళం స్టార్స్ ఓటీటీలో సిరీస్ లు, మూవీస్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. కానీ తెలుగు యాక్టర్స్ మాత్రం ఓటీటీలో సినిమాలు చేసేందుకు ఒప్పుకోవడం లేదు. ఒకేవేళ చేసిన చాలా తక్కువ మంది. అందులో అవుట్ డేటెడ్ హీరోలే ఎక్కువ. స్టార్ మాత్రం చేయడంలేదు. 

తాజాగా ఇదే ప్రశ్న స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ఎదురైంది. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషి మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా మీరు ఓటీటీ కంటెంట్ పై ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా విజయ్ మాట్లాడుతూ.. నాకు వెబ్ సిరీస్‌లు  చేయడంపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేనే కాదు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఓటీటీ ఫార్మాట్‌లో పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదు. కానీ OTT లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూసి ఎంజాయ్ చేస్తాను. నాకు ఆడియన్స్ ను 70MM స్క్రీన్‌పై   అలరించడమే ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

విజయ్ చేసిన కామెంట్స్ విన్న నెటిజన్స్ తమ స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. అందుకే తెలుగు ఇండస్ట్రీ ఇలా తయారయ్యింది, ఎప్పుడైనా కొత్తగా ట్రై చేస్తేనే కొత్త కొత్త కంటెంట్ వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.