విజయ్ దేవరకొండ VD12 స్టోరీ.. పూరీ జగన్నాధ్ మూవీలా?

విజయ్ దేవరకొండ VD12 స్టోరీ.. పూరీ జగన్నాధ్ మూవీలా?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), జెర్సీఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanuri) డైరెక్షన్ లో  VD12 చిత్రం రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. ఇక మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. VD12 స్టోరీ, గతంలో డైరెక్టర్ పూరీ జగన్నాధ్(Puri Jagannadh) డైరెక్షన్లో వచ్చిన గోలీమార్ మూవీని కంపైర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు మూవీస్ ఒకే జోనర్లో కనిపిస్తుండటంతో రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. 

VD12 మూవీ గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్లో..పీరియాడిక్ జోనర్లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ మూవీలో విజయ్ గ్యాంగ్ స్టార్తో పాటు, పోలీస్గా కూడా కనిపిస్తున్నాడు. ఇక రీసెంట్గా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లో..విజయ్ పోలీస్ టోపీ పెట్టుకుని..ముఖానికి నల్ల గుడ్డ కట్టుకున్నాడు. నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి..నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు..నేనొక అనామక గూఢచారి అంటూ రాసుకొచ్చిన డైలాగ్తో..రూమర్స్ ఇంకా బలంగా వినిపిస్తున్నాయి.  

గోలీమార్ మూవీలో గోపీచంద్ కూడా పోలీస్ క్యారెక్టర్ లోను, గ్యాంగ్ స్టార్ గాను కనిపించారు.ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా, యావరేజ్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలోని డైలాగ్స్, గోపీచంద్ పెర్ఫార్మన్స్ అదిరిపోయాయి. ఇక VD12 నుంచి ఇప్పటివరకు పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ రిలీజ్ అయ్యాక స్టోరీ ఏంటనేది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే.

VD12మూవీలో హీరోయిన్ గా బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(SreeLeela) నటిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నారు. వీరి నుంచి వచ్చిన జెర్సీ మూవీలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇక మరోసారి వీరిద్దరి కాంబోలో అద్దిరిపోయే సాంగ్స్, గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. 

ఈ మధ్య టాలీవుడ్,కోలీవుడ్ లో రిలీజ్ అయ్యే సినిమాల వివరాల్లోకి వెళ్తే.. గ్యాంగ్ స్టార్ కథలే ఎక్కువ వస్తున్నాయి. ప్రభాస్ నుంచి సలార్, విజయ్ లియో, లేటెస్ట్ గా రజినీ జైలర్ తెరకెక్కుతున్నాయి. విజయ్ దేవరకొండ VD12 కి అన్నీ సెట్ అయితే కనుక సినిమా అద్దిరిపోవడం కన్ఫర్మ్ అంటున్నారు ఆడియన్స్. సితార ఎంటెర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. 

ప్రసెంట్ విజయ్ దేవరకొండ..సమంత ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నారు.ఈ మూవీ సెప్టెంబర్ 1న తెలుగు,తమిళం.మలయాళం,హిందీ,కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.