విజయ్, రష్మిక నిశ్చితార్థం జరిగిందా..? ట్రెండింగ్లో ఉన్న ఈ టాపిక్లో నిజమెంత..?

విజయ్, రష్మిక నిశ్చితార్థం జరిగిందా..? ట్రెండింగ్లో ఉన్న ఈ టాపిక్లో నిజమెంత..?

సినిమా డెస్క్, వెలుగు: టాలీవుడ్‌‌‌‌లో ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతున్న ప్రేమ ప్రచారానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట తెరదించారు. కొన్నేండ్లుగా రిలేషన్‌‌‌‌లో ఉన్న వీళ్లిద్దరూ త్వరలో వివాహ బంధంలోకి అడగు పెట్టనున్నారు. శుక్రవారం ఉదయం వీరిద్దరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌‌‌‌లో జరిగినట్టు సమాచారం. 

ఫిల్మ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని విజయ్ ఇంట్లో అత్యంత రహస్యంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తున్నది. దీనిపై విజయ్, రష్మిక నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్, రష్మిక తొలిసారి కలిసి నటించారు. 

షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్‌‌‌‌’తో వీరి బంధం మరింత బలపడింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ డేటింగ్‌‌‌‌లో ఉన్నారంటూ పలుమార్లు వార్తలొచ్చాయి. వెకేషన్‌‌‌‌కు కలిసి వెళ్లడం, ఇద్దరి ఫొటోస్‌‌‌‌లోనూ ఒకే లొకేషన్‌‌‌‌ కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. 

వీళ్లిద్దరూ ఆ వార్తలపై నేరుగా స్పందించకపోవడంతో పాటు ఎప్పుడూ ఖండించలేదు. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఎంగేజ్‌‌‌‌మెంట్‌‌‌‌తో సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేశారు. ఇంకా వివాహ తేదీ ఖరారవలేదని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.