
నటి ‘సమంత’పై రౌడీ బాయ్ ‘విజయ్ దేవరకొండ’ ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను కాలేజీలో చదువుకొనే రోజుల్లో ‘సమంత’తో ప్రేమలో పడ్డానని అన్నారు. ఇప్పటికీ ఆమెను ఆరాధిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సమంత నటించిన ‘యశోద’ సినిమాట్రైలర్ లాంఛ్ చేసిన విజయ్.. మూవీ టీంకు బెస్ట్ విషెస్ చెప్పారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంతతో ఖుషీ సినిమా చేస్తున్నారు. ఇక సమంత విషయానికొస్తే ఆమె ప్రస్తుతం ‘యశోద’ సినిమాలో నటిస్తున్నారు. హరి - హరీష్ దర్శకులుగా పరిచయం చేస్తూ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్ పతాకంపై సినిమా తెరకెక్కింది. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మతదితరులు నటిస్తున్నారు.