నా ప్రేమ ఇలానే ఉంటుంది.. విజయ్ దేవరకొండ

నా ప్రేమ ఇలానే ఉంటుంది.. విజయ్ దేవరకొండ

సమంత(Samantha)..విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కాంబోలో వస్తున్న కంప్లీట్ లవ్ స్టోరీ 'ఖుషి'(Kushi). ఇప్పటికే ఈ మూవీ నుంచి రీలీజైనా పోస్టర్స్, సాంగ్స్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా విజయ్ తన ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియో రీసెంట్ గా రిలీజైన ఆరాధ్య(Aradhya) సాంగ్ లోని క్లిప్ కావడం విశేషం. ఖుషి లాంటి అందమైన ప్రేమకథలోనే కాకుండా..నిజ జీవితంలో కూడా నా ప్రేమ ఇలానే ఉంటుందని..ఒక చక్కటి ఫీలింగ్ ను విజయ్ పంచుకోగా.. ఫ్యాన్స్  నిజంగానే ఖుషి అవుతున్నారు. ఆరాధ్య పాటకు చిత్ర దర్శకుడు శివ నిర్వాణ(Siva Nirvana) సాహిత్యం అందించగా..ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు.

ఈ వీడియోలో సమంత విజయ్ దేవరకొండ నిద్రపోతూ..నిద్రలో ఒకరికొకరు హత్తుకునే సన్నివేశం ఎంతో ఆర్ద్రతను అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ వీడియో చాలా క్యూట్ గా.. క్యూరియాసిటీగా ఉండటంతో దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ ట్వీట్ కు వీపరీతంగా స్పందిస్తున్నారు. ఎంతో బ్యూటీఫుల్ సాగే ఈ సాంగ్ లో భార్య భర్తల అనుబంధాన్ని చక్కగా చూపించినట్లు తెలుస్తోంది.

శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ అందరినీ కనెక్ట్ చేస్తోందని..వీరి నటనతో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోందని డైరెక్టర్ ఇది వరకే తెలిపారు. హేషామ్ అబ్దుల్ వాహాబ్  మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ నుంచి హార్ట్ సోల్ ట్యూన్స్ వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఖుషి మూవీ  2023 సెప్టెంబర్ 1న  ప్రేక్షకుల ముందుకు రానుంది.