ఫ్రాన్స్ లో మాల్యా ఆస్తులు సీజ్

ఫ్రాన్స్ లో మాల్యా ఆస్తులు సీజ్

లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యాకు ఈడీ భారీ షాకిచ్చింది. ఫ్రాన్స్‌లో 1.6 మిలియన్‌ యూరోలు(దాదాపు రూ.14.33 కోట్లు) విలువైన ఆయన ఆస్తులను సీజ్‌ చేసింది. మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఆస్తుల ను సీజ్‌ చేసినట్టు తెలిపింది. ఈడీ విజ్ఞప్తితో 32 అవెన్యూ ఫోచ్‌ ప్రాంతంలోని మాల్యా ఆస్తులను ఫ్రెంచ్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఆస్తులను సంపాదించుకునేందుకు కింగ్‌ షిషర్‌ ఎయిర్‌లైన్స్‌ లిమిటెడ్‌ నుంచి విదేశాలకు పెద్ద మొత్తం లో నగదు బదిలీ చేసినట్టు విచారణలో తేలిందని ఈ సందర్భంగా ఈడీ తెలిపింది. మూత పడిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌ లన్స్‌ బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్ల రుణాలను తీసుకుని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయాడు మాల్యా. మార్చి 2016 నుంచి యూకేలోనే ఉంటున్నాడు. మాల్యాను అప్పగింతపై బ్రిటిష్‌ సుప్రీంకోర్ట్‌లో భారత్‌ పిటిషన్‌ వేసింది.