టమాటాలు పంచిన స్టార్ హీరో అభిమానులు

టమాటాలు పంచిన స్టార్ హీరో అభిమానులు

ప్రస్తుతం మార్కెట్ లో టమాటా ధరలు కొండెక్కి కుర్చున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి చర్చ. ఎందుకంటే.. మనకి నిత్యావసర వస్తువుల్లో ఒకటిగా మారిపోయింది టమాటా. నిజం చెప్పాలంటే టొమాటో లేకుండా కర్రీ అంటే కష్టమే అని చెప్పాలి. ఇక ఒక్కసారిగా పెరిగిన టమాటా ధరలతో సామాన్యులు చాల ఇబ్బంది పడుతున్నారు.

వారి ఇబ్బందిని గుర్తించిన తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఫాన్స్.. మహిళలకు ఉచితంగా టమాటాలు పంచారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అభిమాన సంఘం అధ్యక్షులు తాంబరం విక్కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమిళనాడులోని ఆలందూరులో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున మహిళలు హాజరై టమాటాలు స్వీకరించారు. టమాటాలు పంచి గొప్ప మనసు చాటుకున్న విజయ్ సేతుపతి అభిమానులకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.