Slum Dog 33 Temple Road: విజయ్ సేతుపతి స్లమ్ డాగ్.. 33 టెంపుల్ రోడ్ ఫస్ట్ లుక్ అదిరింది

Slum Dog 33 Temple Road: విజయ్ సేతుపతి స్లమ్ డాగ్.. 33 టెంపుల్ రోడ్ ఫస్ట్ లుక్  అదిరింది

విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్ డాగ్‌‌‌‌..  33 టెంపుల్ రోడ్’. ఇటీవల విడుదల చేసిన సేతుపతి ఫస్ట్‌‌‌‌ లుక్‌‌‌‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో  కీలకపాత్ర పోషిస్తున్న దునియా విజయ్ లుక్‌‌‌‌ను రివీల్ చేశారు.  మంగళవారం ఆయన బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ  ఫస్ట్ లుక్‌‌‌‌ను విడుదల చేశారు. 

ఇందులో దునియా విజయ్ పోషిస్తున్న పాత్ర సహజత్వానికి, వాస్తవికతకు దగ్గరగా ఉంటూ ఉత్కంఠభరితంగా ఉంటుందని ఈ సందర్భంగా మేకర్స్‌‌‌‌ తెలియజేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌‌‌ జరుగుతున్నాయి. సంయుక్త హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు కీలకపాత్ర పోషిస్తున్నారు. 

బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పూరి కనెక్ట్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు.