అదృష్టమంటే విజయ్‌ శంకర్‌దే

అదృష్టమంటే విజయ్‌ శంకర్‌దే

అదృష్టమంటే ఆల్ రౌండర్ విజయ్ శంకర్ దే. పెద్దగా కష్టపడకుండానే ఐపీఎల్ టైటిల్ను ముద్దాడాడు.  దిగ్గజాలకు సాధ్యం కానీ అరుదైన ఘనతను శంకర్ ఈజీగా సొంతం చేసుకున్నాడు. ఈ ఐపీఎల్లో విజయ్ ఎక్కువ శ్రమపడలేదు...పెద్దగా పరుగులు చేయలేదు..ఎక్కువగా వికెట్లు కూడా పడగొట్టలేదు. అయినా..అతను ఐపీఎల్ ట్రోఫీని ఎత్తుకున్నాడు. అందుకే ఫ్యాన్స్ అంటున్నారు అదృష్టమంటే విజయ్ శంకర్దే అని. 

విఫలమై ఛాంపియన్గా మారాడు..
ఐపీఎల్ 2022 మెగా వేలంలో శంకర్‌ను గుజరాత్ రూ.కోటి 40 లక్షలకు కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్గా అతను జట్టుకు పనికొస్తాడని అంచనా వేసింది యాజమాన్యం. ఆరంభంలో అతనికి వరుసగా నాలుగు మ్యాచుల్లో అవకాశం ఇచ్చింది. అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో విజయ్ శంకర్ విఫలమయ్యాడు. నాలుగు మ్యాచుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అత్యధిక స్కోరు 13. అటు బౌలర్గానూ రాణించింది లేదు. 4 మ్యాచుల్లో 1.3 ఓవర్లు మాత్రమే వేసి..15 పరుగులు ఇచ్చాడు. జట్టు బాధ్యతను పంచుకుంటాడు అనుకుంటే..భారంగా మారాడు. దీంతో గుజరాత్ మేనేజ్‌మెంట్ అతన్ని పక్కనపెట్టింది. ఫైనల్ వరకు శంకర్ను బెంచ్కే పరిమితం చేసింది. ఇటు కెప్టెన్ హార్థిక పాండ్య, మిల్లర్, రషీద్ ఖాన్, వృద్దిమాన్ సాహా లాంటి ఆటగాళ్ల రాణింపుతో గుజరాత్ వరుస విజయాలు సాధించింది. లీగ్ దశలో టాప్ ప్లేస్లో నిలిచి ప్లేఆఫ్కు చేరుకుంది. ప్లేఆఫ్లోనూ రాజస్థాన్ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో అదే రాజస్థాన్ను ఓడించి..అరంగేట్ర సీజన్‌లోనే ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఫస్ట్ టీమ్గా రికార్డు సృష్టించింది. దీంతో జట్టు సభ్యుడైన విజయ్ శంకర్ కూడా.. ఐపీఎల్ ఛాంపియన్ అయ్యాడు. 

మహా మహులకే సాధ్యం కాలేదు..
దీంతో అభిమానులు లక్ స్టార్ శంకర్ అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. క్రికెట్ స్టార్లయిన కోహ్లీ, డివిలియర్స్, గేల్ లాంటి మహామహులు అందుకోని ఐపీఎల్ ట్రోఫీని పెద్దగా కష్టపడకుండానే   అందుకున్నావంటూ సెటైర్లు వేస్తున్నారు. శంకర్ వల్లే గుజరాత్ గెలిచిందని..అతను టీమ్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టే గుజరాత్కు అదృష్టం కలిసి వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.  ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగించాలంటున్నారు. రాబోయే సీజన్లోనూ శంకర్ జట్టు తరపున ఆరంభ మ్యాచుల్లో ఆడి విఫలమవుతాడని...ఆ తర్వాత బెంచ్కే పరిమితమై..జట్టు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషిస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇది మొదటి సారి కాదు..
మ్యాచులు ఆడకపోయినా..టైటిల్ దక్కించుకున్న జట్టులో ఉండటం శంకర్కు ఇది మొదటి సారి కాదు. గతంలో 2016 హైదరాబాద్ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అప్పుడు కూడా విజయ్ శంకర్ జట్టులో సభ్యుడు. ఆ సీజన్లో హైదరాబాద్ తరపున శంకర్ ఒక్క మ్యాచ్  కూడా ఆడలేదు. అయినా ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడయ్యాడు.