Murder Mubarak Trailer: నెట్‌ఫ్లిక్స్లో మరో బ్లడీ థ్రిల్లర్..మర్డర్ ముబారక్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Murder Mubarak Trailer: నెట్‌ఫ్లిక్స్లో మరో బ్లడీ థ్రిల్లర్..మర్డర్ ముబారక్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నెట్‌ఫ్లిక్స్ (Netflix) ట్రెండ్ రోజురోజుకు అమాంతం పెరుగుతూ వస్తోంది.నెట్‌ఫ్లిక్స్ తర్వాతే మిగతా ఓటీటీస్ అన్నట్లుగా స్ట్రాంగ్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. దీనికి కారణం లేకపోలేదు..నెట్‌ఫ్లిక్స్ ఎంచుకునే సినిమాల కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది.ఇపుడు నెట్‌ఫ్లిక్స్ లో సినిమా వస్తుందంటే..ఆ సినిమాలో ఏదో బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉండేలా స్ట్రాంగ్ కంటెంట్ తీసుకువస్తోంది. 

లేటెస్ట్ గా నెట్‌ఫ్లిక్స్ మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మర్డర్ ముబారక్ (Murder Mubarak) ని తీసుకొచ్చింది. సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, డింపుల్ కపాడియా, కరిష్మా కపూర్, సంజయ్ కపూర్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

రాయల్ ఢిల్లీ క్లబ్ లో జరిగిన ఓ హత్య చుట్టూ తిరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీతో ట్రైలర్ ఆకట్టుకుంది. ఢిల్లీ నగరంలో స్టార్ సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలకు మాత్రమే అనుమతి ఉన్న ఈ క్లబ్ లో జరిగే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. 

"ది రాయల్ ఢిల్లీ క్లబ్..బ్రిటీషర్ల కోసం బ్రిటీష్ అధికారులు ఏర్పాటు చేసుకున్న క్లబ్. ఆ ఆంగ్లేయులైతే వెళ్లిపోయారు కానీ.. ఇక్కడున్న వాళ్లు మాత్రం ఆ ఆంగ్లేయుల కంటే ఎక్కువ ఆంగ్లేయులు" అనే పంకజ్ త్రిపాఠీ వాయిస్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది. అదే సమయంలో సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, డింపుల్ కపాడియా, కరిష్మా కపూర్ చేసే హంగామా సరదాగా ఉంది. కానీ,ఆ ప్రమాదం జరగకపోయి ఉంటే రాయల్ క్లబ్ పేరు అలాగే ఉండిపోయేదేమో అని పంకజ్ అనడం..ఆ వెంటనే క్లబ్ లో ఓ హత్య జరిగినట్లు చూపించడం ఆకట్టుకుంటోంది.

ఇక అదే టైంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఏసీపీ హోదాలో పంకజ్ త్రిపాఠీ ఎంటర్ అవుతాడు. ఆ హత్య క్లబ్ లోని వాళ్లే ఎవరో చేశారన్న అనుమానంతో అందరినీ ప్రశ్నిస్తూ ఉండటం ఆసక్తి రేపుతోంది. మరి హత్య ఎవరు చేశారన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.మర్డర్ ముబారక్ నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది