విజయకాంత్ మృతిపట్ల సంతాపం తెలిపిన మోదీ, కమల్, ఎన్టీఆర్

విజయకాంత్ మృతిపట్ల సంతాపం తెలిపిన మోదీ, కమల్, ఎన్టీఆర్

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటుడు,  డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..  చెన్నైలోని మియాట్‌ ఇంటర్నేషనల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 డిసెంబర్  28 ఉదయం తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ మృతి పట్ల తమిళనాడు  సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

నరేంద్ర మోదీ: విజయకాంత్‌ తమిళ సినిమా లెజెండ్. ఆయన నటన లక్షల మంది హృదయాలను తాకింది. రాజకీయ నాయకుడిగా తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత ప్రభావాన్ని చూపించారు విజయకాంత్. ప్రజా సేవలో ఉంటూ, వారి సమస్యలపై చాలా ఏళ్లుగా పోరాడారు. తమిళనాడు రాజకీయాల్లో ఆయన లేనిలోటు పోదాచలేనిది.

కమల్‌ హాసన్‌: నా సోదరుడు విజయకాంత్ మరణవార్త తీవ్ర విషాదాన్ని నింపింది. తమిళనాడు రాజకీయాల్లో ఆయనది ప్రత్యేకమైన స్థానం. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన విప్లవ కళాకారుడు ఆయన. తమిళ సినీ, రాజకీయ రంగాల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఎన్టీఆర్‌: విజయకాంత్‌గారి మరణ వార్త చాలా బాధాకరం. సినిమా, రాజకీమ రంగాల్లో ఆయనొక  పవర్‌హౌస్‌. ఒక మంచి నటుడితో పాటు మనసున్న రాజకీయనాయకుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.